ఉండవల్లి రన్నింగ్ కామెంటరీ ఎవరి కోసం?

undavalli arun kumar comments on jagan over Boycotting Assembly

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ మీడియా సీన్ లోకి వచ్చేసాడు. ఈసారి జగన్ పాదయాత్ర, వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ వంటి విషయాల మీద తన అభిప్రాయాలు వెల్లడించారు. జగన్ పాదయాత్ర టీడీపీ సర్కార్ మీద వ్యతిరేకత వెల్లడించే ఓ వేదిక అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో అసెంబ్లీ ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు . ప్రతిపక్షమే లేకుండా పోతే అసెంబ్లీలో ప్రజాసమస్యలపై అధికార పార్టీని ఇక ఎవరు నిలదీస్తారని ఉండవల్లి ప్రశ్నించారు.

mp-undavalli-arun-kumar

రాజకీయ పరిణామాల మీద ఉండవల్లి రన్నింగ్ కామెంటరీ చేయడం కొత్త కాదు. పైగా ఆ కామెంట్స్ ద్వారా ఆయన టీడీపీ కి వ్యతిరేకంగా, వైసీపీ కి అనుకూలంగా ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టాలని భావిస్తున్నారు. అది కూడా న్యూట్రల్ కోటా నాయకుడిగా సాధించాలని అనుకుంటున్నారు. అయితే జనాలు ఆయన మనసులో ఏముందో బాగానే కనిపెట్టారు. అందుకే ఉండవల్లి రన్నింగ్ కామెంటరీ ని పట్టించుకోవడం మానేశారు. రాష్ట్ర విభజనకి ముందు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ప్రజలు ఆయన్ని నిజంగా మేధావిగా భావించారు. పైగా ఆయన మాటలు, వ్యూహాలు నమ్ముకుని ఆంధ్ర ప్రజలు చివరి నిమిషం దాకా రంగంలోకి దిగకుండా ఆగిపోయారు. ఎప్పుడైతే విభజన జరిగిపోయిందో ఉండవల్లి మాటకి విలువ తగ్గింది.

undavalli-arun-kumar

ఇక కొత్త రాష్ట్రంలో పట్టిసీమ లాంటి ఆలోచనని తప్పుబట్టి ఆయన పూర్తి స్థాయి రాజకీయ ధోరణిలోనే వున్నారని జనానికి అర్ధం అయ్యింది. అందుకే వైసీపీ లో చేరకుండా ఆ పార్టీకి మేలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని జనం పట్టించుకోవడం మానేశారు. అప్పుడప్పుడు తాను న్యూట్రల్ అని చెప్పుకోడానికి తమ మీద విమర్శలు చేయడాన్ని వైసీపీ శ్రేణులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. దీంతో పాటు వై.ఎస్ పాత మిత్రుల్ని మళ్లీ జగన్ దగ్గరికి చేరుస్తానని ఆయన వైసీపీ కి ఇచ్చిన హామీ ఒక్క మల్లాది విష్ణు దగ్గరే ఆగిపోయింది. ఉండవల్లి పనితనం మీద జగన్ కి ఆశలు లేకుండా పోయాయి. ఉండవల్లి రాజకీయం కన్నా రామోజీ ఆశీస్సులు బెటర్ అని ఆయన ఫీల్ అవుతున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం ఉండేకొద్దీ ఉండవల్లి విమర్శలకి కౌంటర్ ఇవ్వడం కూడా దండగన్న స్థితికి వచ్చారు. మొత్తానికి ప్రస్తుతం ఉండవల్లి రన్నింగ్ కామెంటరీ పట్టించుకునే వారు లేరు. ఆయన అవసరం ఎవరికీ లేదు. అయినా ఆయన ఎవరి కోసం నోరు పారేసుకుంటున్నారో అర్ధం కావడం లేదు.