మోలీవుడ్ యువ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మన టాలీవుడ్ లో ఆల్రెడీ డైరెక్ట్ గా ఒక డెబ్యూ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఆ మూవీ తర్వాత దుల్కర్ చేసిన రెండో తెలుగు మూవీ నే “లక్కీ భాస్కర్”. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ డేట్స్ తర్వాత ఫైనల్ గా ఈ మూవీ దీపావళి కానుకగా రాబోతుంది.
అయితే ఈ మూవీ పై అప్పటి వరకు డీసెంట్ హైప్ లోనే ఉంది కానీ మూవీ ట్రైలర్ వచ్చాక మాత్రం మూవీ పై మరింత బజ్ నెలకొంది అని చెప్పాలి. ట్రైలర్ చూసాక ఆడియెన్స్ లో మళ్ళీ ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉన్నది అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ బజ్ ను లక్కీ భాస్కర్ క్యాష్ చేసుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ మూవీ కి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికి తెలిసిందే.