ఉంగరాల రాంబాబు తెలుగు బుల్లెట్ రివ్యూ…

ungarala rambabu Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  సునీల్ , మియా జార్జ్ , ప్రకాష్ రాజ్ , పోసాని కృష్ణ మురళి, ఆలీ , వెన్నెల కిషోర్ 
నిర్మాత :     పరుచూరి కిరీటి 
దర్శకత్వం :   క్రాంతి మాధవ్ 
మ్యూజిక్ డైరెక్టర్ :  జిబ్రాన్ 
ఎడిటర్ :      కోటగిరి వెంకటేశ్వర రావు 
సినిమాటోగ్రఫీ : శ్యామ్  కె. నాయుడు 

వరస అపజయాలు ఎదుర్కొంటున్న హీరో సునీల్, నిర్మాత పరుచూరి ప్రసాద్ కలిసి చేసిన సినిమా ఉంగరాల రాంబాబు. ఓనమాలు , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి లాంటి మంచి సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ ని దర్శకుడిగా ఎంచుకున్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ కూడా కామెడీ జానర్ చేయాలని ట్రై చేస్తుండగా ఈ సినిమా సెట్ అయిపోయింది. కాంబినేషన్ పరంగా చూస్తే నిజంగా చాలా ఇంటరెస్ట్ కలిగించేదే. ఆ ఆసక్తికి తగ్గట్టు ఉంగరాల రాంబాబు సినిమా వుందో, లేదో చూద్దాం.

కథ…

తాత చెప్పిన మాటలతో ధైర్యం తెచ్చుకున్న రాంబాబుకి పెద్దాయ్యాక ఓ బాబా పరిచయం. అతని సలహాతో చేసిన వ్యాపారం కలిసి రావడంతో ఇక ఆ బాబాని ( పోసాని ) గుడ్డిగా నమ్ముతూంటాడు ఉంగరాల రాంబాబు. రాంబాబు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటే అతనికి కలిసి వస్తుందో ఆ బాబా చెప్తాడు. అలాంటి లక్షణాలు వున్న సావిత్రి అనే అమ్మాయి రాంబాబు ఆఫీస్ లోనే మేనేజర్ గా చేరుతుంది. ఆమెని ప్రేమలో దించడానికి రాంబాబు ఓ ఆఫీస్ టూర్ ని వాడుకుంటాడు. అతని ప్రేమని ఒప్పుకున్నట్టే ఒప్పుకున్న ఆమె తన తండ్రిని ఒప్పిస్తేనే పెళ్లి అంటుంది. అయితే సగటు ఆడపిల్ల తండ్రి తన కూతుర్ని అన్ని విధాలుగా సుఖపెట్టగల వారికోసం చూస్తాడు. కానీ ఈ సావిత్రి తండ్రి ( ప్రకాష్ రాజ్ ) ఓ కమ్యూనిస్ట్. అతడు కాబోయే అల్లుడి నుంచి అంతకు మించి కోరుకుంటాడు. రాంబాబుకి ఎన్నో పరీక్షలు పెడతాడు. భిన్న ధృవాల్లాంటి ఈ మామ అల్లుళ్ళు చివరికి ఏమి అవుతారు అన్నదే ఉంగరాల రాంబాబు కథ.

విశ్లేషణ …

మానవత్వం గొప్పదా, కమ్యూనిజం గొప్పదా ? . ఈ ప్రశ్న వినగానే e అనిపిస్తోంది ? ఇదేదో సీరియస్ మేటర్ అనిపిస్తోందా ? .ఔను నిజంగా ఇది సీరియస్ చర్చ. ఇంత సీరియస్ విషయాన్ని ఓ కామెడీ కథతో, కామెడీ హీరో తో చెప్పి ఒప్పించాలని దర్శకుడు క్రాంతి మాధవ్ అనుకోవడమే ఓ సాహసం. ఆ పాయింట్ నచ్చి సినిమా చేసిన నిర్మాత పరుచూరి ప్రసాద్ డి సాహసం.ఇక ఫెయిల్యూర్స్ లో వుండి కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న సునీల్ చేసింది సాహసమే. ఈ ముగ్గురు సాహసం వల్ల వచ్చిన సినిమా ఉంగరాల రాంబాబు . అయితే జాతకాలు నమ్మే హీరో అనగానే లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఆ ఒక్కటీ అడక్కు దాకా ఎన్నో సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇక కాబోయే అల్లుడికి మామ పరీక్షలు పెట్టడమంటే అప్పటి రోజుల నుంచి ఈమధ్య వచ్చిన సినిమా చూపిస్తా మావ దాకా ఎన్నో సినిమాలు. ఇక మానవత్వం, కమ్యూనిజం మీద చర్చ అంటే ఈ మధ్యలో పెద్దగా వచ్చింది లేదు. ఇలాంటి మూడు భిన్న అంశాల్ని కలిపి ఓ కధగా రాసుకున్నాడు దర్శకుడు క్రాంతి మాధవ్.

ఉంగరాల రాంబాబు ప్రమోషన్ కోసం ఓ యు ట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రాంతి మాధవ్ తాను ఒకే సినిమాలో ఒకే జానర్ ని టచ్ చేయగలను గానీ, రెండు మూడు జానర్స్ ని మిక్స్ చేయలేనని చెప్పాడు. అది తన వల్ల కాదన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పింది నిజం. ఓ రొటీన్ స్టోరీ ని ఇంటెన్సిటీ వున్న దర్శకుడు తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా డైలాగ్స్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఏ సీన్ కి ఆ సీన్ విడివిడిగా చూస్తే అలా అనిపించినా మొత్తంగా చూసినప్పుడు మనది కాని చెప్పులో కాళ్ళు పెట్టి పరుగులు తీసినట్టు అనిపిస్తుంది. ఉంగరాల రాంబాబు పరిస్థితి కూడా అంతే. బాగుందని కానీ బాగా లేదని కానీ చెప్పలేని పరిస్థితి. చెప్పులు కొత్తవి , కాళ్ళు కూడా ఆరోగ్యంగా వున్నా సైజు మ్యాచ్ కాలేదు. అందుకే తడబాటు నడక. ఇంతకు మించి ఏమీ చెప్పలేము. క్రాంతి మాధవ్ రాసిన కొన్ని డైలాగ్స్ ఆయన వర్త్ ఏమిటో చెప్తాయి. కానీ కథ, కధనాల విషయంలో ఇంకా జాగ్రత్తగా వుండాలని ఈ సినిమా ఆయనకి ఓ హెచ్చరిక అనుకోవాలి.ఈ సినిమాలో హీరో పాత్ర సునీల్ కి కొట్టిన పిండి లాంటిదే. ప్రకాష్ రాజ్ తో కాంబినేషన్ లో కూడా ఎక్కడా లోటు లేకుండా చేయగలిగాడు. వెన్నెల కిషోర్ పాత్ర ఓకే.

ప్లస్ పాయింట్స్ …

సునీల్
ప్రకాష్ రాజ్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ …

రొటీన్ సీన్స్
బోరింగ్ అండ్ లెంగ్తీ స్పీచెస్

తెలుగు బులెట్ పంచ్ లైన్… రాంబాబు ఉంగరాల చేతితో మొట్టికాయ వేసాడు.
తెలుగు బులెట్ రేటింగ్… 2.5 /5 .