Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్నిరోజులుగా పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం చర్చకి రాకుండా చేసి సభని నిరవధిక వాయిదా వేయించడంలో విజయం సాధించిన తరువాత మొట్టమొదటి సారిగా మోడీ స్పందించారు. పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా బీజేపీ ఎంపీలంతా నిరాహారదీక్ష చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన దీక్షకు దిగాలని చెప్పారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఈ సంగతిని మీడియాకు తెలిపారు. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే… కాంగ్రెస్ మాత్రం మోసపూరిత రాజకీయాలకు తెరలేపిందని, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీలు, నేతలంతా నిరసన ప్రదర్శనలకు సిద్దం కావాలని ప్రధాని పిలుపునిచ్చారని తెలిపారు.
అయితే ఈ చర్యలు ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే గత 12 రోజులుగా సభ జరుగుతుంటే అవిశ్వాస తీర్మానం సహా చాలా సమస్యలని తెలియపరిచే విధంగా పార్లమెంట్ లో ఆందోళన చేస్తుంటే పట్టించుకోని మోడీ సభ అయిపోయిన కాసేపటికి ఈవిధంగా ఒక సమావేశం పెట్టి ఇలా వ్యాఖలు చేయడం చూస్తుంటే బీజేపీ స్టాండ్ ఏంటో అర్ధమవుతోంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ప్రతిపక్షాల నోరు నొక్కడం కోసమే ఇన్నిరోజులు సభని వాయిదాలు వేయిస్తూ వచ్చి, ఇప్పుడు ఆ నింద బీజేపీ మీద పడకుండా ఉండడం కోసమే ఈ నిరహర్ దీక్ష చేయిస్తున్నట్టుగా ఉంది.