ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 2 ఇందిరానగర్–కృష్ణానగర్ మెయిన్ రోడ్డులోని గ్రీన్ బావర్చి హోటల్ వద్ద ఫుట్‌పాత్‌పై ఓ మృతదేహం పడి ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.
ఘటనా స్థలానికి చేరుకుని చుట్టూ పక్కల ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో దీంతో గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్నారు.