క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి సిమ్రన్ ఖోస్లాను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉన్ముక్త్.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా దేశవాళీ క్రికెట్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఉన్ముక్త్ చంద్.. అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలోనే 2012 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, టీమిండియాకు ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆరంభంలో ఉన్ముక్త్ చంద్ అమెరికాకు మకాం మార్చాడు.
అక్కడ మైనర్ లీగ్ క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్… బిగ్‌బాష్ లీగ్‌కు సంతకం చేసిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక ఉన్ముక్త్ భార్య సిమ్రన్ ఫిట్‌నెస్, న్యూట్రిషన్ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.