Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా వేగంగా చెడ్డపేరు తెచ్చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న యూపీ ఆస్పత్రిలో చిన్నారుల మరణాల వేడి చల్లారకముందే. ముస్లింలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి. కృష్ణాష్టమిని పోలీసులు పోలీస్ స్టేషన్లో సెలబ్రేట్ చేయడంతో.. సామాన్యులు ఫిర్యాదులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.
బాధ్యత గల సీఎంగా దీన్ని ఖండించాల్సిందిపోయి.. రంజాన్ సమయంలో ముస్లింలు నడిరోడ్డుపై నమాజు చేసిన ఘటనను స్ఫూర్తి పొంది పోలీసులు ఇలా చేశారని యోగి సమర్థించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తనకు అన్ని మతాలు సమానమే అని చెబుతున్న యోగి.. ఇలాంటి కామెంట్స్ ను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ఆదిత్యనాథ్ అందరివాడని మొదట్లో తెగ ప్రచారం చేసిన మీడియా కూడా వరుస ఘటనలు చూసి సైలంటైపోయింది. కనీసం శిశుమరణాలపై వీలైనంత ఫోకస్ చేయలేదు. కనీసం ఇప్పుడు కృష్ణాష్టమి రోజు పోలీసుల హడావిడిని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాన్ని పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా యోగికి అప్పజెప్పారేమోననే డౌట్ బీజేపీ కార్యకర్తలకు వస్తోంది. ఇలాంటి ఘటనలు కొనసాగితే.. సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి యూపీనే షాకిచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
మరిన్ని వార్తలు:
పైకి శాంతి.. లోపల యుద్ధం