ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయ వాక్యాలు అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా ఆమె తెలుగు చిత్ర ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ.. ఆమె మంచి మనసుతో, నడవడికతో, సాంఘిక కార్యక్రమాలతో ఆమె తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అపోలో హాస్పిటల్స్ కు సంబంధించి కీలక బాధ్యతలు తీసుకున్న ఉపాసన పారిశ్రామిక వేత్తగా తన సత్తా చాటిన సంగతి మనకి తెలిసిందే.
ఉపాసన అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆమెకు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్, ఉపాసన ఒకరినొకరు ప్రేమించుకొని ఐదు సంవత్సరాల తరువాత పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్ తనకి ఒక భర్త కంటే ముందే ఒక మంచి ఫ్రెండ్, మంచి ఫిలాసఫర్ అని ఉపాసన ఇప్పటికే చాలా సార్లు తెలిపారు. ప్రస్తుతం అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుటుంబం దేశంలోని టాప్ 100 బిలియనీర్ల జాబితాలో ప్లేస్ దక్కించుకుంది.
ఇటీవల, ఐ.ఐ.ఎఫ్.ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ను ప్రకటించేసింది . మొదటి వందమంది బిలియనీర్ల జాబితాను ఈ లిస్ట్ లో ప్రకటించారంట . వారిలో ప్రతాప్ రెడ్డి ఫ్యామిలీ 78 వ స్థానంలో ఉందంట . ఇందులో ఉపాసన ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు 21,000 కోట్ల రూపాయలని మనకి తెలుస్తోంది. ఉపాసన గారి తాతగారి సంపాదన ఏకంగా 169 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అపోలో ఆసుపత్రిని 1983 సంవత్సరంలో స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్ కి పలు బ్రాంచ్ లు, ఫార్మసీలు, వైద్య విద్యా కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటి నుంచి ఉపాసన ఫ్యామిలీ కి ప్రధానంగా ఆదాయం వస్తుంది.