Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగిన సమయంలో చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి రామ్ చరణ్ ఎందుకు ఏమాత్రం అందంగా లేని ఉపాసనను వివాహం చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ వచ్చాయి. చరణ్, ఉపాసన పెళ్లి ఫొటోలు చూస్తే అంతా కూడా అవాక్కవాల్సిందే. అయితే ఉపాసనలో ఈ మద్య అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆమె వెయిట్ సగానికి పైగా తగ్గింది. చరణ్ కంటే కూడా అందంగా తయారు అయిన ఉపాసనను చూసి అప్పుడు విమర్శలు చేసిన వారు ఇప్పుడు పొగడ్తలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఉపాసన పోస్ట్ చేసిన ఒక ఫొటో మళ్లీ వైరల్ అయ్యింది. ఇటీవలే ఉపాసన చాలా సన్నబడి కనిపించింది. అందులో కంటే తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో మరింతగా సన్నబడి కనిపించడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో ఉపాసన ఎంత బరువు తగ్గిందో చెప్పకనే చెబుతుంది. మెగా ఫ్యాన్స్ చరణ్ పెళ్లి సమయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. కాని ఇప్పుడు ఉపాసనను చూసి అంతా కూగా గర్విస్తున్నారు. ఆమె మంచి మనస్సుతో పాటు అందం చరణ్ అదృష్టం అంటూ అభివర్ణిస్తున్నారు. మొత్తానికి రూపంది ఏముంది ఎప్పుడు ఎలా అంటే అలా మార్చుకోవచ్చు, మనస్సు ముఖ్యం అనే విషయాన్ని ఉపాసన నిరూపించింది.