గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ని దర్శకుడు శంకర్ పూర్తి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించగా చరణ్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మూవీ కు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ‘గేమ్ ఛేంజర్’ సినిమా కి వస్తున్న రెస్పాన్స్‌పై రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తాజాగా ఓ ట్వీట్ చేశారు.
‘గేమ్ ఛేంజర్’ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. రామ్ చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ప్రతి విషయంలోనూ రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ ఛేంజర్’ అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా తన భర్త మూవీ కి వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమా లో రామ్ చరణ్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులని కట్టిపడేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.
https://x.com/upasanakonidela/status/1877668738977447944