టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ రాజా రవితేజతో కలిసి ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ను రిలీజ్ కి రెడీ చేశాడు. ఈ మూవీ ను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా హరీష్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.
ఇక ఆగస్టు 15న ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు హరీష్ అండ్ టీమ్ రెడీ అయ్యింది. ఈ మూవీ తరువాత హరీష్ ఎవరితో మూవీ చేస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆయన ఎప్పట్నుండో మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టునే హరీష్ తన నెక్ట్స్ సినిమా గా చేయబోతున్నట్లు తెలుస్తుంది .
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి ఒక స్క్రిప్టు కూడా వినిపించాడట ఈ డైరెక్టర్. చిరు కూడా ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పాడని.. సరైన సమయంలో ఈ మూవీ ని అనౌన్స్ చేసేందుకు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ‘మెగా’ ప్రాజెక్ట్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుందా అని మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.