డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చక్రాటా అనే ప్రాంతంలో బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు.

బస్సు .. బైల గ్రామం నుంచి వికాస్‌నగర్‌లోని చక్రాటాకు బయలు దేరింది. ఈ క్రమంలో మలుపుల వద్ద.. బస్సు అదుపుతప్పింది. ప్రమాద ప్రాంతం.. అత్యంత లోతుగా ఉండటంతో సహయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సహయక చర్యలకు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.