భారతీయ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తీసుకోబోతునన్నారు అనే కథనాలు వినిపిస్తున్నాయి .
టెస్టులు మరియు వన్డే ఇంటర్నేషనల్లో అనేక కెప్టెన్సీ రికార్డులను ధోనీ సాధించిన విషయం అందరికీ తెలిసిందే . భారత్ ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి సారి మొదటి స్థాననికి తిసుకువెళ్ళిన ఘనత ధోనీదే. ధోనీ సారథ్యంలో ఆసియా కప్, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఇంకా చెప్పుకుంటూ ఉంటే ఇండియా చాలా ఘనతలని సాదించింది.
2014 డిసెంబరు 30 న టెస్టుల్లో ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కాని వరల్డ్ కప్ తరువాత ధోనీ తన కెరీర్ కి వీడుకోలు చెపుతారని చాలా కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాని ఈ పుకార్ల పైన మాజీ క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ స్పందించారు. ధోనీ రెండు నెలలు దూరంగా ఉండడం వల్ల ఈ ఊహాగనాలు ఎక్కువ అయ్యాయి. భారత క్రికెట్ కి ఎంతో సేవ చేసిన ధోనీ తన కెరీర్ కి ఎప్పుడు వీడుకోలు చెప్పాలన్నది తన నిర్ణయమే, తన నిర్ణయం పైననే ఆధారపడి ఉంటుంది అని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.