వైష్ణవ్‌ తేజ్‌కి రజినీకాంత్ అంటే చాలా ఇష్టం

వైష్ణవ్‌ తేజ్‌కి రజినీకాంత్ అంటే చాలా ఇష్టం

తొలి చిత్రం ఉప్పెనతో భారీ సక్సెస్‌ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. ఈ మూవీలో తనదైన నటనతో తెలుకు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. దీంతో వైష్ణవ్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ఉప్పెన రిలీజ్‌ కాకముందే క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను పూర్తి చేశాడు. అయితే అది ఇంకా రిలీజ్‌ కాలేదు. ఈ కుర్ర హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసిన వైష్ణవ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు.తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌ నిర్వహించాడు.

అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు అతడు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో మీ అభిమాన హీరో ఎరవని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు రాజనీకాంత్‌ సర్‌ అని సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే మెగా హీరోల్లో ఎవరిని అడిగిన ఫస్ట్‌ మెగాస్టార్‌ పేరు చెబుతారు. ఆయనే తమకు స్ఫూర్తి అని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక వైష్ణవ్‌ రజనీకాంత్‌ పేరు చెప్పడంతో ఆ నెటిజన్‌ షాక్‌ అయ్యాడు. వెంటనే ఆయన సినిమాలో ఏ సినిమా ఇష్టమని అడగ్గా.. శివాజి అని సమాధానం ఇచ్చాడు వైష్ణవ్‌. అలాగే మలయాళ నటి నజ్రియా నజీమ్‌ తన ఫేవరేట్‌ యాక్ట్రస్‌ అని కూడా చెప్పుకొచ్చాడు.