మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చనిపోయేవరకూ అవివాహితుడిగానే ఉన్నారని చాలామందికి తెలుసుకానీ ఆయన ఎందుకు అలా ఉండిపోయారో చాలామందికి తెలియదు. అయితే ఆయన కధలో కూడా ఒక రాజా కుమారి ఉంది ఆ కద లోకి వెళితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో చేరిన వాజ్ పేయి కాలేజీ రోజుల్లో రాజ్ కుమారి అనే అమ్మాయితో కలసి చదువుకున్నారు. అప్పటినుంచి వీరి స్నేహం కొనసాగింది. రాజ్ కుమారికి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బీఎన్ కౌల్ తో వివాహమైంది. పెళ్లయిన తర్వాత కూడా వారి కుటుంబాల మధ్య్ స్నేహం కొనసాగింది.
కొన్నేళ్ల తర్వాత దురదృష్టవశాత్తూ కౌల్ ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో రాజ్ కుమారితో పాటు ఆమె కుమార్తెలు నమ్రత, నమితను తన దగ్గరకు రావాల్సిందిగా వాజ్ పేయి ఆహ్వానించారు. నమితను దత్తత తీసుకున్నారు. నమిత, ఆమె కుమార్తె నీహారిక (నేహ) అంటే వాజ్‌పేయికి ప్రాణం. ఇక.. వాజ్‌పేయితో దశాబ్దాలపాటు స్నేహ బంధం ఉన్నప్పటికీ రాజ్‌కుమారి ఎన్నడూ ఆయనతో బయట కనిపించలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు రాజ్‌కుమారి(84) కన్నుమూశారు. ‘వాజ్‌పేయి కుటుంబ సభ్యురాలైన రాజ్‌కుమారి కన్నుమూశారు’ అని ఓ పత్రికా ప్రకటన వెలువడిందంతే.