తమిళంలో ఎంట్రీ ఇచ్చేసిన అనన్య

తమిళంలో ఎంట్రీ ఇచ్చేసిన అనన్య

మల్లేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ అనన్య నాగళ్ల. వకీల్‌సాబ్‌ సినిమాతో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న అనన్య ఇప్పుడు తమిళంలో సైతం ఎంట్రీ ఇచ్చేసింది. కోలీవుడ్‌ హీరో శశికుమార్‌ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు అనన్య ఎంపికైంది.

దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను అనన్య ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. టైమ్ ట్రావెల్ బేస్డ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి అంజల ఫేమ్ తంగం పా శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.