నిజం… మా కథ కాపీ కాదు

Vakkantham Vamsi reacts On Naa Peru Surya Naa Illu India Copy Rumours

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఒక ప్రెంచ్‌ సినిమాకు కాపీ అని విడుదల ముందు ప్రచారం జరిగింది. ఆ విషయం నిజమే అంటే ప్రెంచ్‌ సినిమా దర్శకుడు స్వయంగా పేర్కొనడంతో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పరువు పోయింది. పవన్‌ 25వ చిత్రం అంటే చాలా ప్రతిష్టాత్మకమైనది. అలాంటి ప్రతిష్ట్మాక చిత్రంను కాపీ కథతో తెరకెక్కించడంతో మెగా ప్యాన్స్‌ త్రివిక్రమ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్‌ అంతటి దర్శకుడే కథను కాపీ చేస్తే ఇక చిన్న దర్శకుల మాటేంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్‌లుగా తెరకెక్కుతున్న సినిమాల కథల విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

అల్లు అర్జున్‌ హీరోగా ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని రచయిత వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఒక ఇంగ్లీష్‌ మూవీ నుండి తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. యాంట్‌ వోన్‌ ఫిషర్‌ అనే ఆంగ్ల మూవీ కథతో బన్నీ సినిమా కథ పోలి ఉందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలను కొట్టి పారేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

దర్శకుడు వక్కంతం వంశీ తాజాగా సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ యాంట్‌ వోన్‌ ఫిషన్‌ చిత్రంతో తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, తాను తీసుకున్న కథ ఒక పూర్తి ఫ్రెష్‌ కథ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ విషయాన్ని మాత్రం వారు పూర్తి కాన్ఫిడెన్స్‌తో చెప్పడం లేదు. సినిమా విడుదలైతే కాని అప్పుడు అసలు మ్యాటర్‌ బయటకు రాదు. సినిమా విడుదల సమయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆ ఇంగ్లీష్‌ సినిమా హక్కులు తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.