సముద్ర గర్భంలో బద్దలయిన అగ్నిపర్వతం

సముద్ర గర్భంలో బద్దలయిన అగ్నిపర్వతం

దక్షిణ ఫసిఫిక్‌ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం శనివారం బద్దలవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ.ఎత్తువరకు వ్యాపించినట్లు టోంగా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

అమెరికా నుంచి జపాన్‌ వరకు తీరప్రాంతంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంత నష్టం జరిగిందనేది తెలియలేదు. లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా తీరప్రాంతంలో భారీగా అలలు ముంచెత్తుతున్న వీడియోలను ప్రజలు సోషల్‌మీడియాలో షేర్‌చేశారు. ముప్పు తొలగిపోవడంతో అమెరికాలో సునామీ హెచ్చరికల్ని వెనక్కి తీసుకున్నారు.