బస్టాండ్ లో కరోనా కలకలం

బస్టాండ్ లో కరోనా కలకలం

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో కరోనా కలకలం రేపింది. హనుమకొండ నుంచి వచ్చిన బస్సులో విధులు నిర్వహించిన కండక్టర్ త్రివేణికి కరోనా పాజిటివ్ రావడంతో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణీకుల్లో ఆందోళన నెలకొంది. హనుమకొండ బస్‌ డిపోకు చెందిన బస్సు శనివారం మంచిర్యాల చెన్నూరుకు ప్రయాణింది. ఈ బస్సులో త్రివేణి కండక్టర్‌గా ఉన్నారు. బస్సు చెన్నూరుకు చేరుకున్న తర్వాత ఆమెకు తీవ్రమైన దగ్గు రావడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఆంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ చేయించారు చేయించారు.

ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. 15 రోజుల పాటు సిక్ లీవ్‌లో ఉన్న కండక్టర్ త్రివేణి రెండ్రోజుల క్రితమే డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ బస్సులో ప్రయాణించిన వారిలో ఆందోళన నెలకొంది. కండక్టర్‌‌కు కరోనా సోకడంతో అధికారులు బస్సును ఖాళీగా హనుమకొండకు పంపించారు. మరోవైపు చెన్నూరు డిపోలో డ్యూటీ ఆఫీసర్‌కు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.