అనారోగ్యంతో ” శ్రీ వంగపండు ప్రసాదరావు” మృతి

అనారోగ్యంతో ” శ్రీ వంగపండు ప్రసాదరావు” మృతి

మనిషి తన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలలను ఎన్నటికీ మర్చిపోకూడదు అంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం అలాంటి వారు చాలా తక్కువ మందే ఉంటారు. జానపదాలు, సంస్కృతి ఇతర సాహిత్యాలు ఇప్పటికీ మరుగున పడిపోతున్నాయి.

అలాంటి జానపద గేయాలలో తర్వాత తరాలకు అందిస్తూ వస్తున్న ప్రముఖ జానపద కళాకారులు ” శ్రీ వంగపండు ప్రసాదరావు” గారు ఈరోజు అనారోగ్యంతో తన తుది శ్వాస విడువడంతో సినీ కళాకారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అలాగే వారితో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఆయన్ను స్మరిస్తూ నివాళులు అర్పించారు.

గత జూలై 21 న కూడా ఎంతో ఉత్సాహంగా పాటలు పాడిన ప్రసాదరావు గారు పాడిన పాటలలో “ఏం పిల్లాడో ఎల్దామ్ ఒస్తావా” పాట అయితే ఒక ట్రెండ్ సెట్టింగ్ పాట ఇలా తన జానపద గేయాలతో ఉత్తరాంధ్రా సంస్కృతిని చాటి చెప్పిన శ్రీ వంగపండు ప్రసాదరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.