ప్రముఖ నటీనటులు విజయ్ కుమార్ మంజుల కూతురిగా వనిత విజయ్‌కుమార్ పాపులర్ అయ్యారు. చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నీ కూడా హిట్ అయ్యాయి. తమిళ, తెలుగు, మళయాం ఇలా అన్ని భాషల్లో ఒక్కో సినిమా చేశారు. నలభై సినిమాలు చేయకపోయినా కూడా నాలుగు మంచి సినిమాలు చేశాను అని వనిత చెప్పుకొచ్చారు. అయితే తెలుగులో చేసిన ఒకే ఒక్క చిత్రం దేవీ. ఆ మూవీ అంత పెద్ద హిట్ అయినా కూడా మళ్లీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణాలను వనిత చెప్పుకొచ్చారు.
దేవీ సినిమా చేసే సమయంలో ఇంకా మెచ్యురిటీ కూడా రాలేదు. టీనేజ్‌లోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటికే మాకు బోలెడంత డబ్బు ఉంది. వాటి విలువ కూడా మాకు తెలియదు. ఆ సమయంలో నేను సినిమాల గురించి ఎక్కువగా ఆలోచించ లేదు. డబ్బులు సంపాదించడం, ఫేమస్ అవ్వడం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. పెళ్లి చేసుకుని పిల్లలను కని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని అనుకున్నాను.అలా అప్పుడే ప్రేమలో పడిపోయాను.
టీనేజ్‌లోనే అలా ప్రేమలో పడటం, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో సినిమా కెరీర్ అంతా పక్కకు వెళ్లిపోయింది. కానీ ఆ పెళ్లికి మాత్రం ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. మతం వేరు అని అతడిని ఒప్పుకోలేదు. ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్పి కాంట్రవర్సీ చేయాలని అనుకోను. ఎందుకంటే నా జీవితానికి సంబంధించిన విషయాలు నేను చెబుతాను.. కానీ అవతలి వ్యక్తి జీవితాన్ని నేను ఎప్పుడూ అలా బయటకు తీసుకురాలేను అని వనిత అన్నారు.