ఓ తమిళ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్వూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు తన తదుపరి చిత్రాలపై వరలక్ష్మి శరత్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాధికపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏ విషయాన్నైనా ముక్కుసటిగా మాట్లాడే వరలక్ష్మి తన సవతి తల్లి, నటి రాధికని తల్లిగా ఒప్పుకోనని, అమ్మ అని ఎప్పటికీ పిలవనని స్పష్టం చేసింది.
తన సవతి తల్లి రాధికను వరలక్ష్మి ఆంటీ అని పిలుస్తారట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే.. ఈ ప్రశ్న తనని చాలా మంది అడిగారని, రాధిక మా అమ్మ కాదు కానీ నేను ఆమెతో సన్నిహితంగానే వుంటాను. నాన్నిని, ఆమె పెళ్లి చేసుకుని సంతోషంగా వుండటం నాకు సంతోషమే. అయితే రాధిక ఆంటీ కుమార్తె రియానేకు మా నాన్న మంచి తండ్రిగా వున్నారని సమాధానం దాటవేసింది.