Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా అధికారుల పని తీరును పర్యవేక్షించే సమయంలో కాలక్షేపం కోసం బస్సులో పాటలు వింటున్న యువకుడిపై అభ్యంతరక పదజాలం ఉపయోగించిన వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆ యువకుడి మీద వర్ల రామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఆ విషయం మీద వర్ల రామయ్య స్పందించారు. ఒక తండ్రిలా నా కులం వాడిని మందలించా ఆ సందర్భంలో కొన్ని అసభ్యపదాలు ఫోన్లలో వచ్చినందుకు చింతిస్తున్నా అన్నారు. అది తప్పంటే తానేమీ చేయలేనని ఆయన పేర్కొన్నారు.
అయితే వర్ల రామయ్య తన కుమారుడిని అసభ్యంగా తిట్టాడు అంటూ కుర్రాడి తల్లి రజనీ కన్నీటి పర్యంతం అవుతోంది. తన కుమారుడు బాగా చదువుతాడని అనేక మెరిట్ సర్టిఫికెట్స్, మెడల్స్ వచ్చాయని అవేమీ తెలుసుకోకుండా వర్ల రామయ్య నా బిడ్డను అందరిలో ఇష్టారాజ్యంగా తిట్టాడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ వీడియోలన్నీ మీడియా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.