షూట్ లో గాయపడ్డ యువహీరో !

Varun Dhawan Injured Severely

బాలీవుడ్ యువ హీరో వ‌రుణ్ ధావ‌న్ న‌టిస్తున్న తాజా సినిమా ఏబీసీడీ 3. డ్యాన్స్ నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ‘ఏబీసీడీ’ సిరీస్‌లో భాగంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రెమో డిసౌజా ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం అమృత్ స‌ర్‌ ప్రాంతంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, ఒక వేడుక‌కి సంబంధించిన సాంగ్‌ ని సినిమా యూనిట్ షూట్ చేస్తుండగా మూడు గ్రూపుల‌తో క‌లిసి వ‌రుణ్ ధావ‌న్ డ్యాన్స్ చేయ‌ల‌సి ఉండ‌గా, ఓ స్టెప్ వేసే క్ర‌మంలో వ‌రుణ్ మోకాలికి గాయ‌మైంద‌ట‌. కాలు మెలితిరిగిందని అందువల్లే గాయం అయ్యిందని అంటున్నారు. దీంతో వెంటనే ఫిజియోతెరపిస్ట్ ని సంప్ర‌దించ‌డంతో ఆయ‌న కొంత రెస్ట్ తీసుకోమ‌ని సూచించార‌ట‌. అభిషేక్ వ‌ర్మ పీరియడ్ డ్రామా చిత్రం క‌ళంక్‌లో ను వ‌రుణ్ ధావ‌న్ గాయ‌ప‌డ‌గా, కొద్ది రోజుల బ్రేక్ త‌ర్వాత చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ షూట్ లో కూడా ఆయన గాయపడ్డారు.