మెగా హీరో వరుణ్‌తేజ్ ఫిధా, ఎఫ్2 సినిమాలు సూపర్ హిట్ కావడంతో మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాల తరువాత గద్దలకొండ గణేష్ మూవీలో మాస్ లుక్‌తో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరో డిఫరెంట్ లుక్‌తో వరుణ్ స్స్ర్కీన్ మీద కనిపించనున్నారు. ప్రతి హీరో తన సినీ కేరీర్లో కనీసం ఒక్కసారైనా పోలీస్ పాత్రలో కనిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు. వరణ్‌తేజ్ విషయంలో అది త్వరలో సాకారం కాబోతోంది.
సాగరచంద్ర దర్శకత్వంలో వరణ్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఈ చిత్రం కథ వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఒక స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్‌లా కనిపించబోతున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో ఎఫ్2 సీక్వెల్ ‘ఎఫ్ 3’ లోనటించడానికి సిద్ధమవుతున్నాడు. వీటి తరువాత వచ్చే ఏడాది సాగరచంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా వేరే కారణాల వల్ల ఆలస్యమైనట్లు తెలుస్తోంది.