వరుణ్ తేజ్ కి పెరిగిపోయిన క్రేజ్

వరుణ్ తేజ్ కి పెరిగిపోయిన క్రేజ్

సినిమాల్లో కొన్ని విలక్షణ కాంబినేషన్లకు భలే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు తెర పంచుకోవడం, అదీ ఇంట్రెస్టింగ్ రోల్స్ పోషించడం ప్రేక్షకులను ఎంతగానో కనువిందు చేస్తుంది. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ వెండితెరపై చూడబోతున్నాం అని తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రిగా స్టార్ హీరోను, తల్లిగా సీనియర్ స్టార్ హీరోయిన్‌ను ఫైనల్ చేశారట.

వైవిద్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ ఇటీవలే ‘గద్దలకొండ గణేష్’ రూపంలో సూపర్ డూపర్ హిట్ సాధించారు. ఇదే జోష్‌లో ప్రస్తుతం తన 10వ సినిమా కోసం రెడీ అవుతున్నారు ఈ మెగా హీరో. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వరుణ్ తల్లిదండ్రులుగా నటించే నటీనటులపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వరుణ్ పేరెంట్స్‌గా రమ్యకృష్ణ, మాధవన్ నటించబోతున్నారని తెలిసింది. అంతేకాదు ఈ రెండు పాత్రలకి సినిమాలో ఎంతో ప్రాధాన్యముంటుందని తెలిసింది. అతిత్వరలో ఈ ఇద్దరి పాత్రలపై చిత్రయూనిట్ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనుందని టాక్. ఇదే జరిగితే తండ్రిగా మాధవన్, తల్లిగా రమ్యకృష్ణ, కొడుకుగా వరుణ్ దుమ్ముదులపడం ఖాయమే మరి.

ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని తెలిసింది. అందుకే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమవుతోందని సమాచారం. విలక్షణ కథాంశంలో రాబోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.