నిర్మాణ సంస్థను మూసేయాలని నిర్ణయించుకున్న విజయ్ ఆంటోనీ

నిర్మాణ సంస్థను మూసేయాలని నిర్ణయించుకున్న విజయ్ ఆంటోనీ

సంగీత దర్శకుడిగా కెరీర్ ను ఆరంభించి అనంతరం కథానాయకుడిగా, నిర్మాతగా మారినవాళ్లలో విజయ్ ఆంటోనీ ప్రధముడు. విజయ్ ఆంటోనీని చూసే జీవి ప్రకాష్ కుమార్ కూడా హీరోగా ప్రయత్నాలు మొదలెట్టాడు. విజయ్ ఆంటోనీ బ్యానర్ నుండి ఒక సినిమా వస్తుందంటే మొదట్లో ఉండే ఆసక్తి ఇప్పుడు లేకుండాపోయింది. నకిలీ, డాక్టర్ సలీం, బిచ్చగాడు, బేతాళుడు వంటి సినిమాలు విజయ్ ఆంటోనీకి తెలుగులోనూ మంచి మార్కెట్ ను క్రియేట్ చేయగా తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆ క్రేజ్ ను నాశనం చేశాయి. మొన్న వచ్చిన “క్రిమినల్” కాస్త ఆడి విజయ్ కు ఉపశమనం కలిగించింది కానీ అప్పటివరకూ విజయ్ ఆంటోనీ సినిమా విడుదలై థియేటర్ లో ఒక వారం ఆడిన సందర్భం కూడా లేకుండాపోయింది.

దాంతో విజయ్ ఆంటోనీ నిర్మాణ సంస్థను మూసేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇకపై హీరోగా వచ్చిన అవకాశాలు చేసుకుంటూ మధ్యమధ్యలో సంగీత దర్శకత్వం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిద్దాం అని ఫిక్స్ అయ్యాడు విజయ్ ఆంటోనీ. మరి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అతడి కెరీర్ ను ఏమేరకు ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి.