Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి మధ్య బంగాళాఖాతంలో 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని విశాఖ వాతావ రణ కేంద్రం తెలిపింది.
ఈ నెల 19వ తేదీకి మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇది వాయువ్య దిశగా పయనించి ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకుతుందని పేర్కొంది.
ప్రస్తుతానికి రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
వాయుగుండంగా మారితే 19వ తేదీ నుంచి కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
(రెండు వందల ) టీఎంసీ ల కు చేరిన నాగార్జున సాగర్ జలాశయము!!
115 టీఎంసీ లు వస్తే సాగర్ పూర్తిగా నిండే అవకాశం!!
మరో వారం రోజులలో నాగార్జున సాగర్ నిండి నీటిని పులిచింతల డ్యామ్ కు విడుదల చేస్తారు!!
ఆదివారం ఉదయము 10 గంటలకు ఇన్‌ఫ్లో: 2,67,513, ఔట్‌ఫ్లో:1,500 !!
నాగార్జున సాగర్ జలాశయము పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 315 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 200 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి !!
నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ఆదివారం పది గంటలకు 545 అడుగులకు చేరుకుంది!!