Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ తో వైసీపీ నేతలను లాక్కోడానికి పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంటే , అయన తనయుడు లోకేష్ వాటిని అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిణామంతో టీడీపీ బలపడుతుందని వారి ఆలోచన అయితే వలస నేతలు తమ అవకాశాలకు ఎక్కడ గండి కొడతారో అన్నది ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు. అందుకే అధిష్టానానికి తెలియకుండా వలస నేతలను నిలువరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నెల్లూరు లో టీడీపీ నేతలు అమలు చేసిన ఆపరేషన్ వికర్ష వ్యూహంతో హర్ట్ అయిన పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తిరిగి జగన్ గూటికే చేరడానికి రెడీ అయిపోయారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ తో కలిసి కొద్దిసేపు నడిచారు.
నిజానికి గనుల వ్యాపారి వేమిరెడ్డి 2013 లోనే వైసీపీ లో చేరారు అయితే అక్కడ పద్ధతులు నచ్చడం లేదని ఎన్నికల తర్వాత కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరం అయ్యారు. టీడీపీ లోకి ఆయన్ను తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి. అవి ఫలించి టీడీపీ లోకి వచ్చేందుకు వేమిరెడ్డి రెడీ అవ్వగానే జిల్లాకు చెందిన నాయకులు కొందరు ఆయనతో వ్యవహరించిన తీరు బాగా లేదట. అందుకు హర్ట్ అయిన వేమిరెడ్డి తిరిగి వైసీపీ గూటికి వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ హైకమాండ్ ఆపరేషన్ ఆకర్ష్ కన్నా ఆ పార్టీ నేతల వికర్ష బాగా పనిచేసిందన్నమాట.
.