ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుని బ్రతకాల్సి వస్తుందని ఆనాడు ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని… కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు నిండుకోవడంతో కేంద్రం వద్ద చేతులెత్తి అడుక్కుంటోందని, అందుకే కేంద్రం ఏం చెప్పినా చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్పనిసరని, అందుకే ఏపీలో మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశమండా మీటర్లను వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం కేంద్రం చెప్పిందంతా వింటూ కీలుబొమ్మగా మారారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.