సుల్తాన్ పై క‌న్నేసిన వెంక‌టేశ్

Venkatesh next film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ హీరో వెంక‌టేశ్ ఎక్కువ‌గా రీమేక్ ల‌పై దృష్టిపెడుతుంటారు. త‌మిళంలోనో, హిందీలోనో హిట్ట‌యిన సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేస్తుంటారు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయ‌న ఇలా రీమేక్ లు చేస్తున్న‌ప్ప‌టికీ… ఈ మ‌ధ్య కాలంలో పూర్తిగా రీమేక్ ల‌వైపే మొగ్గుచూపుతున్నారు.  బాడీగార్డ్,  దృశ్యం, గోపాల గోపాల వంటి సినిమాలు విజ‌య‌వంతం కావ‌డంతో పాటు…తెలుగులో ద‌ర్శ‌కులు చెప్తున్న క‌థలు న‌చ్చ‌కపోవ‌డంతో ఈ సారీ ఆయ‌న రీమేక్ పైనే దృష్టిపెట్టారు. హిందీలో గ‌త ఏడాది వ‌చ్చి భారీ విజ‌యం సాధించిన సుల్తాన్ సినిమా తెలుగులో తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నారు. సుల్తాన్ లో స‌ల్మాన్ ఖాన్, అనుష్క‌శ‌ర్మ హీరోహీరోయిన్లుగా న‌టించారు. స‌ల్మాన్ ఖాన్ కెరీర్ లో మంచి చిత్రంగా నిలిచిన సుల్తాన్ తెలుగులోనూ హిట్ట‌వుతుంద‌ని వెంక‌టేశ్ న‌మ్మ‌కంతో ఉన్నారు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మించాల‌ని ఆయ‌న  నిర్ణ‌యించుకున్నారు. ఈ సినిమాలో వెంక‌టేశ్ స‌ర‌స‌న గురు సినిమా హీరోయిన్ రితికా సింగ్ న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. టైటిల్ తో పాటు..సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.