F2 సినిమాకు సీక్వల్గా రాబోతున్న F3 మూవీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. ”పిల్లలు పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్కి డేట్ ఫిక్స్ చేశాం” అంటూ F3 మూవీ విడుదల తేదీ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.
గతంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా F2 సినిమా రూపొందించి సూపర్ ఫన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు కూడా F3 మూవీ రూపంలో అదే రిపీట్ చేయబోతున్నారు. గతంలో కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లను రంగంలోకి దించుతున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్డేట్స్ భారీ హైప్ తెచ్చిపెట్టాయి.
ఇకపోతే ఈ ఫన్ రైడ్‌లో కమెడియన్స్ రాజేంద్ర ప్రసాద్, సునీల్‌లు కూడా భాగమవుతున్నారు. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. సినిమాకు ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్గా F3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. థియేటర్లో మరోసారి ఫ్యామిలీతో కలిసి నవ్వుల రైడ్ ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులు కుతూహలంగా ఉన్నారు. అదే పాయింట్ లెక్కలోకి తీసుకొని అనిల్.. ఇలా సమ్మర్లో కితకితలు పెట్టేందుకు రెడీ అయ్యారేమో!.