రీమేక్‌ చేయనిదే నిద్ర పట్టేలా లేదు

Venkatesh wants to remake The Great Father movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో అత్యధిక రీమేక్‌లు చేసిన హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు వెంకటేష్‌. కెరీర్‌లో లెక్కకు మించి రీమేక్‌లు చేసిన వెంకటేష్‌ ఇటీవలే బాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన చిత్రన్ని ‘గురు’ అనే టైటిల్‌తో రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే. అందుకు ముందు ‘దృశ్యం’ కూడా రీమేక్‌ అనే విషయం తెల్సిందే. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘ఆట నాదే వేట నాదే’ అనే చిత్రాన్ని చేస్తున్న వెంకటేష్‌ త్వరలోనే మరో సినిమాను కూడా సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు. తేజ ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సమయంలోనే వెంకీ ఒక మలయాళ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సంవత్సరంకు ఒక్కటైనా రీమేక్‌ చేయనిది వెంకటేష్‌కు నిద్ర పట్టదేమో, ‘ఆట నాదే వేట నాదే’ చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం ఒక మలయాళ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు.

మలయాళంలో మమ్ముటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది గ్రేట్‌ ఫాదర్‌’ అనే చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న బడ్జెట్‌ చిత్రంగా రూపొంది పెద్ద విజయాన్ని ఆ చిత్రం సొంతం చేసుకుంది. ఆ కారణంగానే వెంకీకి ఆ సినిమాపై ఆసక్తి కలిగింది. తాజాగా ఆ చిత్రాన్ని చూసిన వెంకీ నచ్చి, మెచ్చి రీమేక్‌ రైట్స్‌ తీసుకునేందుకు సిద్దం అయ్యాడు. వెంకటేష్‌ వయసుకు మరియు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ సినిమా అవ్వడంతో తెలుగులో తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది. గతంలో పలు రీమేక్‌ చిత్రాలతో సూపర్‌ డూపర్‌ హిట్‌లను అందుకున్న వెంకటేష్‌ మరోసారి గ్రేట్‌ ఫాదర్‌గా సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.