Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకయ్య నాయుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న వెంకయ్య.. ఇప్పుడు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు ప్రాణమిత్రులు అని చెప్పుకోతగినవాళ్లు కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లో ఉన్నారు. వీరంతా ఉఫరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేస్తారన్న కలకలం బయల్దేరింది.
కమ్యూనిస్టుల్ని తిట్టే వెంకయ్యకు.. అక్కడ కూడా మంచి పలుకుబడి ఉంది. వెంకయ్య ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయకపోవడంతో.. అందరూ ఆయన్ను అభిమానిస్తారు. ఆ అభిమానమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కలిసొస్తుందని భావిస్తున్నారు. పొలిటిల్ పంచ్ లకు పెట్టింది పేరైన వెంకయ్య ఉపరాష్ట్రపతుల్లోనే రికార్డు మెజార్టీ సాధిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా ఎన్డీఏకు బలం లేని రాజ్యసభలో కూడా చాలా మంది వెంకయ్యకు ఓటేస్తారని అనుకుంటున్నారు. అదే నిజమైతే వెంకయ్య కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో కోవింద్ కు ఏపీ మొత్తం ఓటేసింది. తెలంగాణలో కాంగ్రెస్ వేయలేదు. కానీ వెంకయ్యకు మాత్రం పార్టీలకు అతీతంగా తెలుగు ఎంపీలంతా ఓటేస్తారనే అంచనాలున్నాయి.