సందడి చేస్తున్న మామా అల్లుళ్ళు

సందడి చేస్తున్న మామా అల్లుళ్ళు
మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్యలు కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. గతంలో ప్రేమమ్ సినిమాలో కాసేపు ఈ ఇద్దరు కలిసి తెరపై కనిపిస్తేనే ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో మామా, అల్లుళ్ళుగా అదరగొట్టబోతున్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక జైలవకుశ సినిమా తరువాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై పాజిటివ్ కార్నర్ ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం
నిజానికి ఈ సినిమాని ముందుగా దసరా సీజన్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సైరా రిలీజ్ పక్కా అని తేలడంతో ఈ సినిమాని డిసెంబర్‌కి వాయిదా వేశారు. అయితే విజయదశమి పండుగ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు వెంకీమామ ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పల్లెటూరి వాతావరణంలో ఓ ట్రాక్టర్‌పై వెంకటేష్, చైతు,రాశీఖన్నా, పాయల్ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్టర్ చూసిన అక్కినేని, దగ్గుబాటి హీరోల అభిమానులు మామా అల్లుళ్లు సూపర్ అని మురిసిపోతున్నారు. అలాగే పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా ఇద్దరూ కూడా ట్రెడిషనల్ వేర్‌లో కనిపిస్తున్నారు. పోస్టరే చాలా కలర్ ఫుల్ గా ఉండడంతో రేపు రాబోయే వీడియో కంటెంట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో చైతు ఆర్మీలో పనిచేస్తున్న సోల్జర్‌గా కనిపించబోతున్నాడు. వెంకటేష్ మాత్రం ఒక పల్లెటూరిలో వ్యవసాయం చేసుకునే ఒక రైతు గా కనిపిస్తున్నాడు. అయితే ఎలాగు వీళ్ళ పాత్రల తాలూకు నేపధ్యం ఏంటి అనేది తెలిసిపోయింది కాబట్టి ఇద్దరు హీరోల క్యారెక్టర్స్‌ని రివీల్ చేస్తూ ఆ ఫస్ట్ లుక్ ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే పాయల్ అండ్ రాశి ఖన్నాల లుక్స్ కూడా జస్ట్ అలా కొన్ని సెకండ్స్ పాటు రివీల్ చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనరల్‌గా సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు నిర్మించే సినిమాలకు బడ్జెట్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ సినిమా కథ బాగారావడం, మొదటి సారి చైతు, వెంకీ కలిసి నటిస్తుండడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.