బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా వస్తున్న మల్టీ స్టారర్ సినిమా వెంకీ మామ. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనా ఇప్పటికీ రిలీజ్ పై ఓ క్లారీటీ లేకుండా పోయింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ అనేక రిలీజ్ డేట్లు వార్తల్లోకి వచ్చాయి. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు సురేశ్ బాబు. కానీ ఇప్పుడు ఈ డేట్ కూడా మారిపోయి ఏకంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దీంతో ఇప్పటికే నాలుగు సినిమాలతో ఫుల్ అయిపోయిన సంక్రాంతి సీజన్ ఇప్పుడు అయిదో సినిమాతో కిక్కిరిసిపోయేలా ఉంది.
అయితే.. ఇప్పటికే మహేశ్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల.. వైకుంఠపురంలో, రజినీకాంత్ దర్బార్, కల్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు పోటీ పడుతున్నాయి. రజినీకాంత్, కల్యాణ్ రామ్ సినిమాల కంటే మహేశ్, బన్నీ సినిమాలపైనే క్రేజ్ ఎక్కువుంది. ఇప్పుడీ పోటీలో వెంకటేశ్, నాగ చైతన్య వస్తే ఇప్పటివరకూ ఉన్న ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా మారనుంది. మరి వెంకీమామ రిలీజ్ పై వస్తున్న వార్తలపై సురేశ్ సంస్థ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఓ కథ సినిమాగా తెరకెక్కడమే కష్టమైన పరిస్థితుల్లో ఆ సినిమా రిలీజ్ కు మరిన్ని కష్టాలు పడాల్సొస్తుంది. ముఖ్యంగా సరైన రిలీజ్ టైమ్ దొరక్క దర్శక, నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి స్లాట్ ఉన్నా సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు మొన్నటి దీపావళి పండగే ఉదాహరణ. రెండు తమిళ సినిమాలు తప్ప తెలుగు సినిమాలే లేకపోయాయి. ప్రస్తుతం ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సినిమా వెంకీ మామ. దిగ్గజ ప్రొడ్యూసర్ సురేశ్ బాబుకే ఇలాంటి కష్టాలు రావడం విచిత్రమే మరి.