చాలా గ్రాండ్‌గా ‘వెంకీ మామ’ ప్రి రిలీజ్ ఈవెంట్

చాలా గ్రాండ్‌గా ‘వెంకీ మామ’ ప్రి రిలీజ్ ఈవెంట్

సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అంటే రిలీజ్ ప్లానింగ్ ఎలా ఉంటుందో  ప్రమోషన్లు ఎలా చేస్తారో చెప్పేదేముంది అందులోనూ ఆ బేనర్లో చాలా కాలం తర్వాత వస్తున్న పెద్ద సినిమా పైగా రామానాయుడు కలలు కన్న మామా అల్లుళ్ల (వెంకీ-చైతూ) కాంబినేషన్లో వస్తున్న సినిమా. కాబట్టి హంగామా మామూలుగా ఉండబోదని సంకేతాలు ఇచ్చేశారు. నిన్న సాయంత్రం రిలీజ్ డేట్ ఇచ్చినప్పట్నుంచి వరుసబెట్టి పోస్టర్లు దించుతున్నారు. ఇక వరుసబెట్టి పాటలూ రిలీజ్ చేయబోతున్నారు.

త్వరలోనే ఫుల్ ఆడియో వదిలేస్తున్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్‌గా చేయడానికి ఫిక్సయ్యారు. గత కొన్నేళ్లలో తన బేనర్లో వచ్చిన మరే సినిమాకూ లేని స్థాయిలో ఈ చిత్రానికి పబ్లిసిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట సురేష్. పత్రికల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున ప్రకటనలతో పాటు బయట కూడా ఫ్లెక్సీలు, హోర్డింగులతో ‘వెంకీ మామ’ ప్రచారాన్ని హోరెత్తించి సినిమా రిలీజ్ టైంకి హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.