విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రీమియర్ నుండి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబడుతూనే ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, నార్త్ అమెరికాలో ఈ సినిమా అద్భుతమైన ఘనతని సాధించింది. $2 మిలియన్ల గ్రాస్ మైలురాయిని దాటి, వెంకీ కెరీర్‌లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడున్న కలెక్షన్స్ ని బట్టి, ఈ సినిమా రాబోయే రోజుల్లో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తానికి వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రేక్షకుల ల్లో విపరీతమైన బజ్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించారు. మొత్తానికి బలమైన ప్రమోషన్ల కారణంగా, ప్రేక్షకుల్లో ఈ మూవీ దూసుకువెళ్తుంది. ఈ మూవీ లో శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస రెడ్డి వంటి నటీనటులు నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.