విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌లో వెంకీ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఐతే, పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ లో వెంకటేష్ – ఐశ్వర్య రాజేష్ ల పై ఒక సాంగ్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో భార్యభర్తలుగా వెంకటేష్ – ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నారు.
పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యంతో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట మూవీ లోనే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది . ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.