బతుకుమీద విరక్తి చెందిన వ్యక్తి తన తమ్ముడికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానంటూ చెప్పి అదృశ్యమైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వావిలాల రాజేందర్‌కు మహారాష్ట్రకు చెందిన యువతితో వివాహం జరిగింది.
రెండేళ్లుగా రాజేందర్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం అతను తన తమ్ముడికి, స్నేహితులకు వీడియో కాల్ చేసి తాను బతకను.. చనిపోతానని చెబుతూ కాల్ కట్ చేశాడు. దీంతో రాజేందర్ భార్య ఆర్తి మహదేవపూర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్‌కుమార్ గాలింపు చర్యలు చేపట్టి ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.