విజయ్ దేవరకొండ : ఆ విషయంలో జాగ్రత్త!

Vijay Devarakonda : Be careful in that matter!
Vijay Devarakonda : Be careful in that matter!

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన మూవీ ఫ్యామిలీ స్టార్ కు పరుశురాం దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకి రానున్నది . గీత గోవిందం వంటి హిట్ తర్వాత విజయ్ కాంబోలో వస్తున్న మూవీ ఇది. దీంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్ ప్రమోషన్స్ ను స్పీడ్ గా పెంచేశారు. ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా లైగార్ ఫెయిల్యూర్ మీద స్పందించారు.

 

మూవీ విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని విజయ్ దేవరకొండ అన్నారు. లీగర్ మూవీ కు ముందు తర్వాత నా వైఖరిలో మార్పు లేదు అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నాను. మూవీ విడుదలకి ముందు ఫలితం గురించి అసలు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. లైగర్ తర్వాత నుండి ఇదే అమలు చూస్తున్న నేను విధించుకున్న ఒక శిక్ష అని విజయ్ దేవరకొండ అన్నారు . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన లైగర్ మూవీ పరాజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే.