అప్పుడే ఇమేజ్‌ చట్రంలో చిక్కుకున్న విజయ్‌ దేవరకొండ…!

Vijay Devarakonda Next Film Taxivala,DearComrads

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ హీరో అయ్యాడు. కేవలం మూడు సినిమాలతో స్టార్‌ హీరోల జాబితాలో ఈయన చేరిపోయాడు. విజయ్‌ దేవరకొండ తాజాగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం 50 కోట్ల షేర్‌ దిశగా పరుగులు పెడుతోంది. ఈ చిత్రం తర్వాత విజయ్‌ నటిస్తున్న చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అయితే విజయ్‌ తదుపరి చిత్రాలు అన్ని కూడా ఆయన గత చిత్రాల మాదిరిగా ఉండాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. అర్జున్‌ రెడ్డి లేదంటే గోవిందం పాత్రల తరహాలోనే విజయ్‌ని చూడాలనుకుంటున్నట్లుగా అభిమానులు చెబుతున్నారు. ఇలాంటి పాత్రలు కాకుండా వేరే పాత్రలు చేస్తే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా లేరు.

viajay-devarakonda-dear-com

ఇలాంటి సమయంలో విజయ్‌ దేవరకొండ చేసిన, చేస్తున్న మూడు సినిమాల పరిస్థితి ఏంటా అని ఆయా ఫిల్మ్‌ మేకర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజయ్‌ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రంలో విజయ్‌ ట్యాక్సీవాలాగా కనిపించబోతున్నాడు. అర్జున్‌ రెడ్డి పాత్రకు పూర్తి విరుద్దంగా రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ట్యాక్సీవాలా పాత్ర ఉంటుందనిపిస్తుంది. ఇక ఆ తర్వాత చేయబోతున్న డియర్‌ కామ్రెడ్‌ చిత్రంలో విద్యార్థి లీడర్‌గా కనిపించబోతున్నాడు. ఆ చిత్రంలో గోవిందంకు పూర్తి ఆపోజిట్‌గా విజయ్‌ పాత్ర ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ట్యాక్సీవాలా, డియర్‌ కామ్రెడ్‌ చిత్రాు ఆకట్టుకుంటాయా అంటూ అప్పుడే ఆందోళన వ్యక్తం అవుతుంది.

vijaydevakonda-taxivala