దీప్తి సునయన కనిపించడం లేదే…?

Deepthi Sunaina Don't Active In Social Media

తెలుగు బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతుంది. వారం వారం ఎలిమినేషన్‌ జరుగుతున్నా కొద్ది షో రసవత్తరంగా మారుతుంది. అప్పుడే టైటిల్‌ విజేత ఎవరు అంటూ ఊహాగాణాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక బిగ్‌బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్‌ కూడా వెంటనే పలు మీడియా ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఇంటి నుండి బయటకు వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కాని తాజాగా ఎలిమినేట్‌ అయిన దీప్తి సునయన మాత్రం ఇప్పటి వరకు బయట కనిపించలేదు. దీప్తి సునయన ఇంట్లో ఉన్నప్పటి ప్రవర్తన కాస్త వివాదాస్పదం అయ్యింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను బయటకు వెళ్లనివ్వడం లేదేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

deepthi-sunina

దీప్తి సునయన సోషల్‌ మీడియాలో స్టార్‌గా గుర్తింపు దక్కించుకుంది. సోషల్‌ మీడియా క్వీన్‌గా పేరున్న దీప్తి ఎలిమినేట్‌ అయిన తర్వాత సోషల్‌ మీడియాలో కూడా కాస్త తక్కువగానే కనిపిస్తూ వస్తుంది. అక్క సుష్మ పెళ్లి కారణంగా దీప్తి మీడియాకు దూరంగా ఉంటుందా లేదంటే షోలో వివాదంతో ఆమె తల్లిదండ్రులు ఆగ్రహంతో ఉన్నారో తెలియాల్సి ఉంది. మొత్తానికి దీప్తి సునయన అభిమానులు మాత్రం కాస్త కలవర పడుతున్నారు. దీప్తి సునయన మళ్లీ మునుపటిలా యాక్టివ్‌ అవ్వాలని, ఆమె వీడియోలు మరియు డబ్‌స్మాష్‌లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్నాళ్ల పాటు దీప్తి సునయన ఇలా సైలెంట్‌గా ఉంటుందో చూడాలి. నేడు కాకుంటే ఎల్లుండి అయినా దీప్తి మీడియాలో సందడి చేయాల్సిందే.

deepthi-s-unina