ఎందుకంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమాని తీసిన సందీప్ రెడ్డి ఆ సినిమా రీమేక్‌ని మక్కికి మక్కిగా హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకున్నాడు. సో, ఇప్పుడు కూడా తన మైండ్‌లో ‘అర్జున్ రెడ్డి’ ఫ్లేవర్ అనేది నిండి ఉంటుంది. ఇప్పుడు సందీప్ మార్పులు చేర్పులు చేసినా అవి కూడా ఆ లైన్లోనే ఉంటాయి. దాంతో సినిమాలో సెన్సిబిలిటీస్ దెబ్బతినే అవకాశం ఉంది. క్రాంతి మాధవ్ చేసిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా చూస్తే అతని డైరెక్టోరియల్ సెన్సిబిలిటీస్ ఎంత సున్నితంగా ఉంటాయి అనేది అర్థమవుతుంది.
విజయ్ ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్లాప్ అయ్యింది అనే ప్రెజర్లో ఉన్నాడు.డియర్ కామ్రేడ్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ జోక్యం కూడా ఉంది అని వచ్చిన కామెంట్స్ వచ్చాయి.కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల మేలుకంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. లేదంటే ప్రతి ఒక్కరు తమ సినిమాలని రిలీజ్‌కి ముందు వేరే డైరెక్టర్స్‌తో రిపెయిర్ చేయించి హిట్స్ కొట్టేసేవాళ్ళే. సినిమా చూపించి ఒపీనియన్ తీసుకోవడం వేరు, సినిమాని నచ్చినట్టుగా మార్చమని చెప్పడం వేరు.