అర్జున్‌ రెడ్డికి 40 ఏళ్ల వయస్సు వచ్చాక..!

vijay devarakonda talks about arjun reddy sequel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ ఏ రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుని రికార్డుల వర్షం కురిపించింది. చిన్న చిత్రాల్లో బాహుబలి తరహా విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళం మరియు బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ అయినా హాలీవుడ్‌ అయినా సూపర్‌ హిట్‌ చిత్రాలకు సీక్వెల్స్‌ చేయడం చాలా సర్వ సాధారణం. అలాగే ఈ చిత్రంకు కూడా సీక్వెల్‌ చేసే ఆలోచనలో దర్శకుడు హీరో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సీక్వెల్‌ చాలా చాలా విభిన్నంగా ఉంటుందని విజయ్‌ దేవరకొండ అంటున్నాడు.

తాజాగా విజయ్‌ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల కాబోతున్న నేపథ్యంలో మీడియాతో విజయ్‌ దేవరకొండ ముచ్చటించాడు. ఆ సమయంలోనే అర్జున్‌ రెడ్డి చిత్రం సీక్వెల్‌ విషయమై మాట్లాడటం జరిగింది. ఇటీవలే సందీప్‌ నాతో సీక్వెల్‌ విషయాన్ని చెప్పాడు. సీక్వెల్‌లో అర్జున్‌ రెడ్డిని 40 ఏళ్ల వయస్సు వ్యక్తిగా చూపించాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ థాట్‌ నాకు బాగా నచ్చింది. తప్పకుండా ఆకట్టుకుంటుందనిపించింది. సందీప్‌ చెప్పిన స్టోరీలైన్‌ నాకు బాగా నచ్చి, వెంటనే డవలప్‌ చేయాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం అదే పనిలో దర్శకుడు ఉన్నాడు అంటూ విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అర్జున్‌ రెడ్డి సినిమా చివర్లో షాలిని పాండే గర్బవతిగా కనిపిస్తుంది. అంటే సీక్వెల్‌లో డబుల్‌ ఫోజ్‌ గ్యారెంటీ అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. సీక్వెల్‌ 2019 లేదా 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.