ఇట్స్ టైం..ఐ యామ్ బ్యాక్ అంటున్న అర్జున్ రెడ్డి

vijay devarakonda upcoming movie pre look release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అర్జున్ రెడ్డి తరువాత విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఈ క్ర‌మంలో మూడు సినిమాలు ఒప్పుకున్నాడు విజ‌య్. వాటిలో కొత్త ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాయ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఒక‌టి. ఇంకా టైటిల్ నిర్ణ‌యించిన ఈ సినిమా ప్రీ లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. స‌మ‌యం వ‌చ్చింది …అయాం బ్యాక్ అని ట్వీట్ చేస్తూ విజ‌య్ ట్విట్ట‌ర్ లో ఈ ప్రీ లుక్ ను షేర్ చేశాడు. పాత‌కాలం నాటి కారు దుమ్మురేపుతూ దూసుకుపోతున్న‌ట్టు ఫ‌స్ట్ లుక్ లో క‌నిపిస్తోంది.

vijay devarakonda tweets

అర్జున్ రెడ్డిలో జూనియ‌ర్ డాక్ట‌ర్ గా క‌నిపించిన విజ‌య్ ఈ సినిమాలో క్యాబ్ డ్రైవ‌ర్ గా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు టాక్సీవాలా టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నియ‌మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా జ‌వాల్క‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. దీంతో పాటు సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న మ‌హాన‌టిలోనూ, సోలో ఫేం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న మ‌రో సినిమాలోనూ విజ‌య్ న‌టిస్తున్నాడు.