‘తొలిప్రేమ’కు కత్తి రివ్యూ

kathi mahesh review on varun tej tholi prema

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నిన్న విడుదలైన చిత్రాలను చెత్తగా ఉన్నాయంటూ నిర్మొహమాటంగా రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల కాలంలో ఇంత మంచి ప్రేమ కథ రాలేదని, ఇలాంటి ప్రేమ కథలు యూత్‌ ఆడియన్స్‌కు తప్పకుండా కనెక్ట్‌ అవుతాయని చెప్పుకొచ్చాడు. మంచి రచనతో దర్శకుడు వెంకీ అట్లూరి ఒక డీసెంట్‌ లవ్‌ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. చిత్రంలో నటించిన ముఖ్య తారాగణం అంతా కూడా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. తప్పకుండా చూడదగ్గ చిత్రం అంటూ మహేష్‌ కత్తి ‘తొలిప్రేమ’కు రివ్యూ ఇచ్చాడు.

kathi mahesh about tholiprema movie

వరుణ్‌ తేజ్‌, రాశిఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించాడు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం టైటిల్‌ పవన్‌ గత చిత్రంది అవ్వడంతో అంచనాు భారీగా పెరిగాయి. కత్తి మహేష్‌ అన్నట్లుగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌, రాశిఖన్నా, సుహాసిని, నరేష్‌లు తమదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. హీరోయిన్‌ రాశిఖన్నా గురించి కత్తి మహేష్‌ స్పెషల్‌గా ట్వీట్‌ చేశాడు. రాశిఖన్నా మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నటిగా నిరూపించుకున్న రాశిఖన్నా మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి నటనతో ఆకట్టుకుంది అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మొత్తానికి వరుణ్‌ తేజ్‌కు మరో సక్సెస్‌ ఖాతాలో పడ్డట్లయ్యింది.