సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఏదొకలా వైరల్ అవుతూనే ఉంటాడు. తాను చేసే సినిమాల విషయంలోనే కాకుండా ఇప్పుడు తాను చేస్తున్న సామాజిక పనుల మూలాన కూడా నెటిజన్స్ అక్షింతలు నుంచి తప్పించుకోలేకపోయాడు.

తాజాగా తాను తెలంగాణా పోలీసులకు కొన్ని అధునాతన మాస్కులను అందజేశాడు. అప్పుడు అందరు బాగానే మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ పబ్లిసిటీ స్టంట్ లు ఎక్కువయ్యిపోయాయని బాహాటంగానే నెటిజన్స్ అంటున్నారు.. దానికి సంబందించిన వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హైదరాబాద్ లో నిరంతరం ఎంతగానో శ్రమిస్తున్న పోలీసులకు జ్యూస్ ప్యాకెట్లను పంపిణి చెయ్యగా అది చూసి నెటిజన్లు విజయ్ పై మండి పడుతున్నారు. విజయ్ ఒకదగ్గర నిలుచుని జ్యూస్ అందిస్తుంటే ఎస్సై తో సహా అందరు వరుసలో వచ్చి తీసుకోడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రియల్ హీరోలు రీల్ హీరోల దగ్గర చేతులు కట్టుకోవాలా దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి అంటూ సామాన్యులు ఈ వీడియో చూసి ప్రశ్నిస్తున్నారు.