దేవరకొండ దూకుడుకు అడ్డు అదుపు లేదు

Vijay Devarakonda Not Use His Vote In Telangana

విజయ్‌ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. దాంతో ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో అంచనాలు లేవు. కాని సినిమా విడుదలై అనూహ్యంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే ఈ చిత్రం 5 కోట్ల షేర్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. రెండవ రోజు మరో నాలుగు కోట్లను వసూళ్లు చేసి రెండు రోజుల్లోనే 9 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సోమవారం నుండి ఈ చిత్రం కలెక్షన్స్‌ తగ్గుతాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా వీక్‌ డేస్‌లో కూడా ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబడుతూ దుమ్ము రేపుతోంది.

దేవరకొండ దూకుడుకు అడ్డు అదుపు లేదు - Telugu Bullet

ఇప్పటికే ఈ చిత్రం 15 కోట్ల షేర్‌ను టచ్‌ చేసిందని, లాంగ్‌ రన్‌లో సునాయాసంగా ఈ చిత్రం 25 కోట్లను వసూళ్లు చేస్తుందని చెబుతున్నారు. విజయ్‌ దేవరకొండ మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అంటూ అభిమానులు సంతోషంను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు ఏ పోటీ లేకపోవడంతో ట్యాక్సీవాలా కలెక్షన్స్‌ అడ్డు అదుపు లేకుండా దూసుకు పోతున్నాయి. అద్బుతమైన వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం ముందు ముందు మరెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి. 2.ఓ చిత్రం విడుదల అయ్యే వరకు ట్యాక్సీవాలా జోరు, స్పీడ్‌ కొనసాగడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. అదే కనుక జరిగితే విజయ్‌ దేవరకొండ ట్యాక్సీవాలా నిర్మాతలు నక్క తోక తొక్కినట్లే అంటున్నారు.