‘నోటా’ విడుదల గందరగోళం…!

Vijaydevarakonda Nota Movie Release Date Postponed

విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. తెలుగులో ఇటీవలే గీత గోవిందం చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అయితే చిత్రం విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. మొదట ఈ చిత్రంను అక్టోబర్‌ 4న విడుదల చేయాలని భావించారు. కాని దసరాకు రాబోతున్న ఎన్టీఆర్‌ మూవీతో పోటీ పడటం వల్ల భారీ నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

vijay-devarakonda-nota

విజయ్‌ దేవరకొడంకు ఉన్న క్రేజ్‌తో రెండు వారాల పాటు భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 4వ తారీకున చిత్రాన్ని విడుదల చేస్తే కేవలం ఒక్క వారంకే కలెక్షన్స్‌ క్లోజ్‌ అవుతాయి. ఆ తర్వాత వచ్చే అరవింద సమేత చిత్రం కలెక్షన్స్‌లో దూకుడు చూపించే అవకాశం ఉందని, అందుకే సినిమాను అరవింద సమేత విడుదల తర్వాత నోటాను తీసుకు రావాలని నిర్ణయించారు. అయితే నోటా విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారా అంటూ సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌ 18న విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే అసలు విడుదల తేదీపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

vijay-devarakonda